
ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రత్యేకంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనుందని సమాచారం. టైటిల్ గ్లింప్స్ ద్వారా సినిమా కాస్ట్యూమ్ లుక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కథాంశానికి సంబంధించిన కొన్ని కీలక హింట్స్ ఇవ్వనున్నారు. ఇప్పటికే చరణ్ లుక్‌పై సోషల్ మీడియాలో భారీ క్రేజ్ నెలకొంది. షూటింగ్ నుంచి లీకైన కొన్ని పిక్స్ వైరల్ అవ్వడంతో, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రత్నవేలు అందిస్తున్న విజువల్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాను మరింత స్పెషల్‌గా మార్చనున్నాయి.ఈ క్రమంలో స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌తో పాటు బుచ్చిబాబు మార్క్ ఎమోషన్ ఈ సినిమాకి హైలైట్ కానుందట. ఇక టైటిల్ ఏమిటో.. ఏ మేరకు ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందో చూడాలి. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లేదంటే వచ్చే ఏడాది సమ్మర్ కు రావచ్చు. ఇక మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా టైటిల్ ప్రకటించడంతో పాటు, టీజర్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా, మెగా ఫ్యాన్స్‌కు ఇది బిగ్ సర్‌ప్రైజ్ కానుంది.