తెలుగు సినీ పరిశ్రమలో నటుదిగా , దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరో గా నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వక్ సేన్ కొంత కాలం క్రితం పలకనామా దాస్ , దాస్ కా దమ్కి అనే సినిమాలలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ రెండు సినిమాల్లో ఈయన హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాలకు దర్శకత్వం కూడా వహించి దర్శకుడిగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే తాజాగా విశ్వక్ సేన్ "లైలా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విశ్వక్ స్టైలిష్ కుర్రాడి పాత్రలో మరియు అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని రేపు అనగా ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8.20 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు ఈ మూవీ 8.50 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకుని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs