![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore//images/categories/movies.jpg)
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈమూవీకి ‘పవర్ క్రికెట్’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను చూసి చరణ్ అభిమానులు కలవర పడుతున్నారు. దీనికి కారణం ఈటైటిల్ వినగానే టీవిలో ప్రసారం అయ్యే రియాలిటీ షో టైటిల్ లా అనిపిస్తోందని టాప్ హీరో సినిమా టైటిల్ లా అనిపించడం లేదు అంటూ చరణ్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి ఈమూవీకి గతంలో ‘పెద్ది’ అన్న టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఇలాంటి టైటిల్ హిందీ ప్రేక్షకులకు అర్థంకాదు కాబట్టి అన్ని భాషల ప్రేక్షకులకు అర్థం అయ్యేవిధంగా ఈ ‘పవర్ క్రికెట్ టైటిల్ ను పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. చరణ్ పుట్టినరోజునాడు ఈమూవీ టైటిల్ అధికారికంగా ప్రకటిస్తారని టాక్. క్రీడల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ విలేజ్ డ్రామా మూవీ కథ కుస్తీ క్రికెట్ ఆటల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.
కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. గతంలో చరణ్ కు ‘రంగస్థలం’ మూవీతో ఎలాంటి పేరు వచ్చిందో ఆస్థాయికి మించిన పేరు హిట్ రికార్డులు ఈమూవీ తమ హీరోకి ఇస్తుందని అభిమానుల అంచనా. దీనికి తగ్గట్టుగానే ఈమూవీ కోసం చరణ్ తన లుక్ ను మార్చుకోవాడమే కాకుండా తన డైలాగ్ డెలివరిలో కూడ చాల మార్పులు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈమూవీని ఈసంవత్సరం దసరా టైమ్ లో విడుదల చేయాలని నిర్మాతల ఆలోచన అని అంటున్నారు..