తెలంగాణ మంత్రి కొండా సురేఖ గడిచిన కొన్ని నెలల క్రితం టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబం పైన సమంత పైన చేసిన వ్యాఖ్యలు ఎంత ధూమారాన్ని రేపాయే చెప్పాల్సిన పనిలేదు. దీంతో అక్కినేని నాగార్జున పరువు నష్ట ధావ కూడా మంత్రి కొండా సురేఖ పైన వేయడం జరిగింది. ఇందులో భాగంగా కోర్టుకి కొండా సురేఖ తాజాగా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కేసు ప్రస్తుతం నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరుగుతూ ఉన్నట్లు సమాచారం. ఈరోజు వ్యక్తిగతంగా కొండా సురేఖ కూడా హాజరయ్యి తన తరఫునుంచి వాదనలు కూడా వినిపించినట్లు తెలుస్తోంది.


గతంలో ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల అక్కినేని కుటుంబం మానసికంగా గాయపరిచారని ఆ వ్యాఖ్యలు సామాజిక మధ్యమాలలో చేసిన పోస్టుల వల్ల మరింత చర్చనీయాంశంగా మారింది అంటూ కూడా వాదనలో తెలిపారట. అయితే సురేఖ చేసిన వ్యాఖ్యలు కేవలం తమ అభిప్రాయమే అంటూ ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదంటూ ఆమె తరపున న్యాయవాది సైతం తెలియజేశారట. ఈ కేసు విభాగం అక్కినేని కుటుంబం మరియు సినీ వర్గాలలో కూడా చాలా ఉత్కంఠతను కలిగించేలా చేస్తోంది.


మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. దీంతో ఆమె సోషల్ మీడియాలో క్షమాపణలు కూడా కోరింది ఈ వాక్యాలకు సైతం అక్కినేని కుటుంబం తీవ్రంగా ఫైర్ అయ్యి పరువు నష్టధావ కూడా వేశారు. సురేఖ తరఫున న్యాయవాది గురుప్రీత్సింగ్ ఇదివరకే ఈ వివాదం పైన ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వాదిస్తున్నారని ఆమె ఎవరిని వ్యక్తిగతంగా కూడా కించపరచలేదు అంటూ కేవలం సామాజిక పరిస్థితులు అభిప్రాయాన్ని మాత్రమే తెలిపిందంటూ కోర్టుకు వెల్లడించారట. ఈ కేసు కొట్టి వేయాలంటూ మంత్రి కొండా సురేఖ తరఫున న్యాయవాది అభ్యర్థించగా.. మరి కోర్టు ఇరువురి వాదనలు విన్న తర్వాత ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: