టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య తాజాగా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ అనే సినిమాలో హీరో గా నటించిన విజయం మన అందరికీ తెలిసిందే. సాయి పల్లవిమూవీ లో హీరోయిన్గా నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ ని ఫిబ్రవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల చేశారు.

మూవీ కి అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంది. ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ఏరియాలో మంచి కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమాకు ఒక ఏరియాలో మాత్రం పెద్ద స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. ఆ ఏరియా ఏది అనుకుంటున్నారా ..? ఈ మూవీకి ఓవర్సీస్ లో పెద్ద స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. ఈ సినిమాకు ఓవర్సీస్ లో ఆరు కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఇప్పటి వరకు ఐదు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక ఐదు రోజులు ముగిసే సరికి ఈ సినిమా కేవలం నాలుగు కోట్ల షేర్ కలక్షన్లను మాత్రమే ఓవర్సీస్ లో రాబట్టగలిగింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన తర్వాత మంచి టాక్ ను తెచ్చుకోవడంతో ఓవర్సీస్ లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది అని , కనీసం ఓవర్సీస్ లో 1 మిలియన్ కలెక్షన్లను ఈజీగా రాబడుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా 1 మిలియన్ కలెక్షన్లను ఓవర్సీస్ లో రాబట్టడం కష్టం గానే ఉంది అని , రాబట్టిన అది చాలా కష్టంగా వచ్చే అవకాశం ఉంది అది చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc