![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/movie-a34985a3-e715-4c0f-963d-13148ff34c62-415x250.jpg)
బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన నిఖిల్ మాలియక్కల్ 22 మంది దాటుకొని 105 రోజులు బిగ్ బాస్ హౌస్ లో జర్నీ చేసి నిఖిల్ గెలిచాడు. రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ లగ్జరీ కారుని కూడా బహుమతిగా పొందాడు. ఇక నిఖిల్, కావ్య ఇద్దరు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. బయట కూడా వాళ్లు ఎప్పుడు కలిసే తిరిగేవాళ్లు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయిందని తెలుసు.
బిగ్ బాస్ 8 సీజన్ విన్నర్ గా నిలచిన నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి సినిమాలలో అవకాశాలు చాలా వచ్చాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే అన్నట్లుగానే నిఖిల్ ఇప్పుడు హీరోగా కనిపించనున్నారు. పెళ్ళిచూపులు ఫేమ్ అభయ్ నవీన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా దర్శకత్వంలో నిఖిల్ ని హీరోగా పెట్టి ఓ సినిమాను తీసేందుకు ప్లాన్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తాం. సినిమా గురించి బిగ్ బాస్ లో ఉన్నప్పుడే నేను నిఖిల్ మాట్లాడుకున్నాం. బిగ్ బాస్ అయిపోయాక నిఖిల్ కి కథ చెప్పాను.. అది నిఖిల్ కి కూడా నచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి' అని చెప్పుకొచ్చాడు. ఇక నిఖిల్ ని వెండితెరపై హీరోగా చూడబోతున్నాము. ఇక బిగ్ బాస్ నిఖిల్ అభిమానులు ఎంతో సంతోష పడుతున్నారు.