మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిషమూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... యువి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని చాలా కాలం క్రితం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక కొంత కాలం క్రితం ఈ సినిమాను జనవరి 10 వ తేదీన విడుదల చేయడం లేదు అని ఈ మూవీ ని 2025 వ సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అని ఓ వార్త వైరల్ అయింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన చాలా పనులు బాలన్స్ ఉండడంతో అవి మే 9 వ తేదీకి పూర్తి కావడం కష్టమే అని ఈ మూవీ ని మరోసారి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జూన్ ఆఖరి వారంలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ ని మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో చిరు సినిమాతో రవితేజ పోటీ పడితే రవితేజకు కాస్త మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావించారు. కానీ చిరు మూవీ ఇప్పుడు మే 9 వతేదీ నుండి తప్పుకుంటున్నట్లు వార్తలు రావడంతో రవితేజ "మాస్ జాతర" సినిమాకు మంచి టాక్ వస్తే సూపర్ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: