టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన కేవలం సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి జోష్ లో కెరియర్ లో ముందుకు సాగిస్తున్నాడు. తాజాగా దిల్ రాజు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలను రూపొందించాడు.

మూవీ లలో గేమ్ చేంజర్ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల కాగా , సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయింది. ఈ రెండు మూవీ లలో గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టగా , సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం నితిన్ హీరో గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు అనే సినిమాని దిల్ రాజు రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీన వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈ సంవత్సరం మే 9 వ తేదీన ఈ మూవీని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక మే 9 వ తేదీన ఇప్పటికే రవితేజ హీరోగా రూపొందిన మాస్ జాతర సినిమా విడుదల కాపడానికి రెడీగా ఉంది. చిరంజీవి హీరోగా రూపొందిన విశ్వంభర సినిమాని కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ విడుదల క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: