![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/heroinecf6a543c-e107-4649-ac71-0dc1f30c804a-415x250.jpg)
అలా ఈమె నటించిన 14 సినిమాల్లో పది సినిమాలు సూపర్ హిట్ .. ఆ సినిమాలే ఈమెను ఇండియన్ సినిమాకు లేడీ సూపర్ స్టార్ గా చేసి ఆకాశంలో కూర్చోబెట్టాయి. ఈనటి మరెవరో కాదు అతిలోకసుందరి శ్రీదేవి. హీరోయిన్ శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తమిళనాడులో పుట్టిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఆ తర్వాత సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని ఇండస్ట్రీలో సినిమాలో నటించి అతిలోకసుందరి అని బిరిదు కూడా అందుకుంది. అలాగే ఈమె బాలీవుడ్ లో సినిమాల నటించి అక్కడే తన జీవితం భాగస్వామ్ని కూడా ఎంచుకుంది.
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని శ్రీదేవి ప్రేమించి పెళ్లి చేసుకుంది .. అయితే బాలీవుడ్లో శ్రీదేవి ఎక్కువ సినిమాలు నటించిన హీరోల్లో సీనియర్ హీరో అనిల్ కపూర్ కూడా ఒకరు .. ఈయన మరెవరో కాదు శ్రీదేవి భర్త బోని కపూర్ తమ్ముడు. ఇలా అనిల్ కపూర్ తో కలిసి మొత్తంగా 14 సినిమాల్లో నటించింది శ్రీదేవి .. అందులో పది సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు అందుకున్నాయి .. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే .. అనిల్ కపూర్ , శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలను బోనీ కపూరే దగ్గరుండి నిర్మించారు .. ఇలా శ్రీదేవి తన సొంత మరిదితో 14 సినిమాల్లో నటించింది.