అయితే ఈ సినిమాల్లో ముందుగా హీరోయిన్ క్యారెక్టర్ కోసం త్రిషను అనుకున్నారట .. కానీ అప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది త్రిష ఆ సమయంలో సునీల్ లాంటి కమెడియన్ తో ఛాన్స్ రావడంతో త్రిష సున్నితంగా నో చెప్పారని టాక్ .. ఇక దాంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ సలోనిని ఎంపిక చేసుకున్నారు .. ఇక సునీల్, సలోని జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది .. అంతేకాకుండా ఈ సినిమాలోని పాటలు సైతం మంచి హిట్ అయ్యాయి.
అయితే ప్రెసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది త్రిష .. పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష తర్వాత వరుస అవకాశాలు అందుకుంటుంది .. ఇటీవలే స్టార్ హీరో అజిత్ కి జంటగా పట్టుదల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ప్రస్తుతం తెలుగు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది .. తెలుగులో ప్రజెంట్ చిరంజీవికి జంటగా విశ్వంభర సినిమాలో నటిస్తుంది అలాగే త్రిష , అజిత్ మరోసారి కలిసిన నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది.