![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/business_videos/laila-moviea6bc5c22-8b6e-450c-857c-82738fc9e419-415x250.jpg)
ఈ సినిమా ఫిబ్రవరి 14న అంటే రేపు విడుదల కానుంది. ఇదిలా ఉండగా... ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. నటుడు పృథ్విరాజ్ వైసిపి పార్టీని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్లు చేశాడని వైసిపి కార్యకర్తలు మండిపడుతున్నారు. పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పకపోతే ఈ సినిమాను ఏపీలోని థియేటర్లలో ఆడనివ్వమని అంటున్నారు. దీంతో హీరో విశ్వక్సేన్ రంగంలోకి దిగి క్షమాపణలు చెప్పారు.
పృధ్విరాజ్ చేసిన వాక్యాలకు, అతనికి ఎలాంటి సంబంధం లేదని విశ్వక్సేన్ అన్నారు. అయితే విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పడానికి ప్రముఖ హీరో ఎన్టీఆర్, నిర్మాత దిల్ రాజు ఉన్నారట. ఎన్టీఆర్ దిల్ రాజు ఇద్దరూ హీరో విశ్వక్సేన్ ని హెచ్చరించడంతోనే విశ్వక్సేన్ ఇలా ప్రెస్ మీట్ పెట్టినట్లుగా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్, విశ్వక్సేన్ మంచి స్నేహితులు. ఆ కారణం వల్లనే ఈ విషయం పెద్ద వివాదం కాకూడదని, ఎన్టీఆర్ ఇచ్చిన సలహా మేరకు విశ్వక్సేన్ క్షమాపణలు చెప్పారట.
అలాగే గేమ్ చేంజర్ విషయంలో జరిగిన తప్పు లైలా సినిమాలో జరగకూడదని దిల్ రాజు సైతం విశ్వక్ కు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కారణంగానే హీరో విశ్వక్సేన్ మీడియా సమావేశాన్ని నిర్వహించి జరిగిన విషయంలో మా తప్పు లేదని, అయినప్పటికీ ఈ ఈవెంట్ మాది కనుక క్షమాపణలు చెబుతున్నామని విశ్వక్సేన్ తెలియజేశారు. మరి రేపు ఈ సినిమా ఏపీలో థియేటర్లలో రిలీజ్ అవుతుందో లేదో అనే సందేహంలో చాలామంది ఉన్నారు.