చాలా రోజులుగా విజయ్ దేవరకొండ ఒక హిట్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ అయినటువంటి లైగర్ దెబ్బ కొట్టడంతో విజయ్ అభిమానులు నిరాశ పడ్డారు.ఇక 2023లో వచ్చిన ఖుషి మూవీ ఓకే టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు అంతగా రాలేదు.ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ తో గత ఏడాది వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా అంత హిట్ అవలేదు.దాంతో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ అయినటువంటి కింగ్ డమ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ కింగ్ డమ్ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కేజిఎఫ్+ సలార్ +దేవర మూడు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని ఇప్పటికే చాలామంది టీజర్ చూసి రివ్యూ ఇస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. దాంతో సినిమా టీజర్ మరింత ఆకట్టుకుంది. అయితే తాజాగా టీజర్ విడుదయ్యాక మూవీకి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

అదేంటంటే.. కింగ్ డమ్ మూవీ మొదట గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ తో కాదు మెగా హీరో రామ్ చరణ్ తో చేయాలనుకున్నారట. అంతేకాదు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. గౌతమ్ తిన్ననూరి రాంచరణ్ కాంబోలో ఆర్సి 16 సినిమా రాబోతుంది అని అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఆ తర్వాత గౌతమ్ హిందీలో తీసిన జెర్సీ మూవీ ఫ్లాప్ అవ్వడంతో ఆ సినిమా ఎఫెక్ట్ ఆర్సి 16 మీద పడుతుందని సినిమా రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపించాయి.అలాగే చరణ్ కి ఈ సినిమా స్టోరీ నచ్చలేదని కూడా రూమర్ వినిపించింది.కానీ అసలు విషయం ఏమిటంటే.. ఈ స్టోరీ లైన్ చిరంజీవికి నచ్చాలని రామ్ చరణ్ చెప్పడంతో వెంటనే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి చిరంజీవికి తన దగ్గర ఉన్న స్టోరీ లైన్ చెప్పారట.
కానీ గౌతమ్ చెప్పిన స్టోరీలో కథ డెప్త్ అంతగా లేదని తన కొడుకుకి ఇలాంటి సినిమా సెట్ అవ్వదు అని చిరంజీవి రిజెక్ట్ చేసారట. ఇక రామ్ చరణ్ చిరంజీవి సినిమాని రిజెక్ట్ చేయడంతో ఇది కాస్త విజయ్ దేవరకొండతో చేయాలి అని గౌతమ్  నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ టీజర్ అయితే బాగుంది.సినిమా విడుదలయ్యాక అసలు రిజల్ట్ తెలుస్తుంది.ఇక ఈ సినిమా విడుదలై హిట్ అయితే మెగా ఫ్యాన్స్ ఒక మంచి సినిమా రామ్ చరణ్ మిస్ చేసుకున్నందుకు నిరాశపడతారు.ఒకవేళ ఫలితం అటూ ఇటు అయితే మాత్రం మరో ఫ్లాప్ నుండి తప్పించుకున్నారని కామెంట్లు పెడతారు. ఇక దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.ఇక కింగ్ డమ్ మూవీ మే 30న విడుదలకు సిద్ధంగా ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: