![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/business_videos/chantabbai-telugu-movie2821f35f-927f-466a-a298-087e060248c3-415x250.jpg)
ఈ సినిమాను జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించారు. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన చంటబ్బాయి నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. ఈ సినిమాలో చిరంజీవి తనదైన కామెడీ, నటనతో ప్రేక్షకులను మెప్పించినప్పటికీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఈ సినిమాలో చిరంజీవి లేడీ గెటప్ లో కనిపించారు. అంతేకాకుండా చిరంజీవి తాను తీసిన సినిమాలన్నింటిలో తన మీసం తీసి నటించిన సినిమా చంటబ్బాయి కావడం విశేషం.
అయితే మొదట ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి మీసం తీయడానికి అసలు ఒప్పుకోలేదట. కానీ ఆ తర్వాత చిరంజీవి ఓ కండిషన్ పెట్టి మీసం తీసేసాడట. ఈ సినిమా యూనిట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మీసం తీసేస్తే నేను కూడా మీసం తీసేస్తానని చిరంజీవి కండిషన్ పెట్టారట. చిరంజీవి పెట్టిన కండిషన్ కి ప్రతి ఒక్కరూ ఒప్పుకొని మీసం తీసేసారట.
అనంతరం చిరంజీవి మీసం తీసేసి సినిమాలో నటించారట. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా సుహాసిని నటించింది. చంటబ్బాయి సినిమా ఆగస్టు 22, 1986న విడుదలైంది. ఈ సినిమాకు కే. చక్రవర్తి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా అనంతరం చిరంజీవి వరుసగా సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.