నటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో నటిగా పరిచయమైంది. మొదట మలయాళం సినిమాలతో తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం తెలుగులో సినిమాలలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఐశ్వర్య రాజేష్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఎనలేని గుర్తింపును అందుకుంది. 


ఈ సినిమాలో వెంకటేష్ కు భార్య పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా అనంతరం ఐశ్వర్య రాజేశ్ వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా నటి ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్, పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. తన తల్లి నటి నాగమణి నుంచి సినిమాల పట్ల తాను ఎంతో స్ఫూర్తి పొందినట్లుగా చెప్పారు. అంతేకాకుండా ఐశ్వర్య రాజేష్ రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ లవ్ కన్నా కూడా అది బ్రేకప్ అయినప్పుడే వచ్చే బాధ అంటే నాకు చాలా భయం అంటూ సంచలన కామెంట్స్ చేసింది.


నేను చాలా సెన్సిటివ్ పర్సన్. చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాను. ప్రేమించే సమయంలో బాగానే ఉంటుంది. కానీ అది బ్రేకప్ అయితే వచ్చే బాధ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుందని ఐశ్వర్య రాజేష్ అన్నారు. గతంలో నేను రిలేషన్షిప్ లో ఉన్నాను. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఓ వ్యక్తిని ఇష్టపడ్డానని ఐశ్వర్య రాజేష్ అన్నారు. అతని నుంచి ఎన్నో రకాల వేధింపులు ఎదుర్కొన్నాను.


దానికన్నా ముందుకూడా అలాంటి ప్రేమను చూశాను అంటూ ఐశ్వర్య అన్నారు. రిలేషన్షిప్ లో ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా భయపడ్డాను. ప్రస్తుతానికి అలాంటివేమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నానంటూ ఐశ్వర్య రాజేష్ కామెంట్ చేశారు. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటే ఎంతగానో ఆలోచిస్తున్నానంటూ ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: