యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో టెంపర్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా 2025 వ సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నేటితో పది సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సినిమా విడుదల అయ్యి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ మూవీ కి ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ ఏరియా లో ఎన్ని కోట్ల కలెక్షన్ లు వచ్చాయి. ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 11.20 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 6.20 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.55 కోట్లు , వెస్ట్ లో 1.75 కోట్లు , గుంటూరు లో 3.02 కోట్లు , కృష్ణ లో 2.08 కోట్లు , నెల్లూరులో 1.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 31.35 కోట్ల కలెక్షన్ లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.50 కోట్లు , ఓవర్సీస్ లో 5.5 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇలా మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 43.10 కోట్ల షేర్ కలెక్షన్ లు వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 43.1 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. దానితో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిన తర్వాత 1.1 కోట్ల లాభాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: