అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన తండేల్.. ఈ సినిమా ఇప్పటివరకు 86 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రాన్ని చందు మండేటి దర్శకత్వం వహించగా బన్నీ వాస నిర్మాతగా వ్యవహరించారు. నాగచైతన్య సరైన సక్సెస్ అందుకోలేక ఇప్పటికి చాలా కాలం అవుతోంది. తండేల్ చిత్రం సక్సెస్ అవ్వడంతో అటు అభిమానులే కాకుండా అక్కినేని అభిమానులు కూడా ఆనందంలో ఉన్నారు. ఇందులో ఒక అందమైన ప్రేమ కథగా చిత్రీకరించారు. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య చాలా ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు చాలామందిని కంఠతడి పెట్టించేలా ఉన్నాయట.


తండేల్ సినిమాలో లవ్ సన్నివేశాలు చాలా మందికి కన్నీళ్లు తెప్పించేలా కనిపిస్తున్నాయట. తాజాగా జబర్దస్త్ ఫైమా సినిమా థియేటర్ కెళ్ళి సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఒక వీడియోని షేర్ చేసింది. ఈ చిత్రంలోని లవ్ సన్నివేశాలను చాలా ఎంజాయ్ చేశానని అలాగే సన్నివేశాలు చూసి చాలా ఏడుపొచ్చింది అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. తండేల్ సినిమా తనకు బాగా కనెక్ట్ అయ్యింది అని కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన చాలా మంది సెలబ్రిటీలు కూడా తమ స్పందన తెలియజేశారు.


ఎప్పుడూ చలాకీగా ఉండే ఫైమా కంట కన్నీరు చూసి చాలామంది అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తండేల్ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన వారందరూ కూడా తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉందని ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. తండేల్ చిత్రంతో నాగచైతన్య 100 కోట్ల క్లబ్లోకి చేరడం ఖాయమని అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు. మరొకసారి సాయి పల్లవి ఖాతాలో బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: