సిద్ధార్థ్ హీరోగా షామిలి హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల క్రితం ఓయ్ మూవీ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆనంద్ రంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా 2009 వ సంవత్సరం జులై 3 వ తేదీన విడుదల అయింది. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల ఈ సినిమాకి బాక్సా ఫీస్ దగ్గర గొప్ప టాక్ రాలేదు. దానితో ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకోలేదు.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్ద స్థాయిలో తట్టుకోలేకపోయిన ఈ సినిమా ఆ తర్వాత బుల్లి తెర ప్రేక్షకులను మాత్రం అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇప్పటికీ కూడా బుల్లి తెరపై ప్రసారం అయినట్లయితే మంచి టి ఆర్ పి రేటింగ్ ను తెచ్చుకుంటుంది. ఇలా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టి బుల్లి తెరపై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాని మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాని ఫిబ్రవరి 26 వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు ఏ స్థాయి కలెక్షన్లు బాక్సా ఫీస్ దగ్గర తక్కుతాయో అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో సిద్ధార్థ్ , షామిలి ఇద్దరూ కూడా తమ అద్భుతమైన నటనలతో ప్రేక్షకులను , విమర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: