తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలం లోనే సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న యువ నటి మణులలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె ఈచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ బ్యూటీమూవీ లో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఆ తర్వాత ఈమె హిట్ ది సెకండ్ కేస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె వరస విజయాలతో ఫుల్ కెరియర్ను ముందుకు సాగిస్తుంది. పోయిన సంవత్సరం ఈమె చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పటికే ఈ సంవత్సరం ఈమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది. విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న సారిని కట్టుకొని , అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి సైడ్ వ్యూ లో తన అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోటీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: