టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను సాగిస్తున్న వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు . ఈయన కొరటాల శివ దర్శకత్వంలో రూపొంది న మిర్చి సినిమా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరి గా కెరియర్ ను కొనసాగించాడు . ఇక ఆ తర్వాత ప్రభాస్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లలో హీరో గా నటించాడు . ఈ మూవీ లో పాన్ ఇండియా మూవీ లుగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాలు సాధించడంతో ప్రభాస్ కి ఈ మూవీల ద్వారా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

దానితో ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటూ వస్తున్నాయి. అలాగే ఈయన క్రేజ్ భారీగా పెరగడంతో ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు వందల కోట్ల రేంజ్ లో పారితోషకాలను కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆయన ఒక్కో సినిమాకు వందల కోట్ల పారితోషకం తీసుకుంటున్న సమయంలో ఒక మూవీ కోసం మాత్రం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండా నటించినట్లు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో నటించడం కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదని , ఫ్రీ గా నటించినట్లు తెలుస్తుంది. మంచు కుటుంబం పై ఉన్న అభిమానం తోనే ప్రభాస్ ఒక రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండా కన్నప్ప సినిమాలో నటించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: