సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారు నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారికి మొదటగా సినిమాల్లో అవకాశాలు రావడం ఎంతో కష్టంగా ఉంటుంది. కనబడ్డ ప్రతి ఆడియన్స్ కు వెళ్లి ఆడిషన్ ఇచ్చినా కూడా అవకాశం వస్తుందా రాదా అనేది చెప్పలేం. అలా కొంత మంది సినిమా అవకాశాల కోసం చెప్పులు అరిగేలా ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి సక్సెస్ అయిన వారు కూడా కొంత మంది ఉంటారు.

ఇకపోతే ఓ మరాఠీ ముద్దు గుమ్మ కేవలం ఓ చిన్న అవకాశం కోసం ప్రయత్నిస్తే వంద సార్లు రిజెక్ట్ చేయబడింది. కానీ చివరకు ఆమె మరాఠీ సినిమా ఇండస్ట్రీ లోని అద్భుతమైన స్థాయికి చేరుకుంది. ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మరాఠీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న నటీమణుల్లో ఒకరు అయినటువంటి ప్రియా బాపట్. ఈమె తన కెరియర్లో ఎక్కువ శాతం మరాఠీ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే కొన్ని హిందీ సినిమాలలో కూడా ఈమె నటించి హిందీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక వెబ్ సిరీస్లలో ,  సీరియల్లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.

ఇక ప్రస్తుతం అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ కెరియర్ బిగినింగ్ లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఈ బ్యూటీటీవీ అడ్వర్టైజ్‌మెంట్లలో సెలక్ట్ కావడానికి ముందు వంద సార్లు ఆమెను రిజెక్ట్ చేశారట. అలా అనేక సార్లు ఈమెను రిజక్ట్ చేసిన ఈమె మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నించి చివరికి సెలెక్ట్ అయిందట. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలలో ,  వెబ్ సిరీస్ లలో ,  సీరియల్ అలో నటిస్తూ అద్భుతమైన స్థాయిలో ఫుల్ బిజీ గా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: