![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/anasuya-acdcab3e-e800-4398-9086-ee3e9e70c42d-415x250.jpg)
ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఈ బ్యూటీ నటనకు ప్రేక్షకులు ఎంతగానో ఆకర్షితులు అయ్యారు. అనంతరం అనసూయ షోలు చేయడం మానేసి పూర్తిగా సినిమాల వైపుకు వెళ్ళింది. ఓవైపు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాలో కీలకపాత్రను పోషించి తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
సినిమాలలో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అంతేకాకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది. ఇదిలా ఉండగా... ప్రస్తుతం అనసూయకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అనసూయ ఓ యూట్యూబర్ తో చాలా క్లోజ్ గా ఉంటున్న వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో దర్శనమిచ్చింది. ఆ వీడియోలో ఒకరిపై ఒకరు చేయి వేసుకొని హాగ్ చేసుకున్నారు. అంతేకాకుండా చట్టపట్టలేసుకొని బయట తిరుగుతూ కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏమైనా రిలేషన్ కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఇంత క్లోజ్ గా ఉంటున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పైన అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.