మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన రామ్ చరణ్ తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ గేమ్ చేంజర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.


సినిమా ఫలితం ఎలా ఉన్నా రామ్ చరణ్ అదేమీ పట్టించుకోకుండా తన తదుపరి సినిమా షూటింగ్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన సినిమా ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ డ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా కోసం రామ్ చరణ్ అన్ని విధాలుగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా సమాచారం అందుతుంది.


ఈ సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీనే చాలా కీలకమని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తన ఫ్లాష్ బ్యాక్ కోసం ఓ గొప్ప సాహసాన్ని చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల కోసం రామ్ చరణ్ దాదాపుగా 10 కిలోల బరువు తగ్గబోతున్నారట. సినీ ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ మొదటి పాత్రలో కాస్త బరువుతోనే కనిపిస్తాడట.


కానీ ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం ఏకంగా 10 కిలోల బరువు తగ్గి కనిపించబోతున్నాడని సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా... రామ్ చరణ్ నటించబోయే ఆర్సి16 సినిమా 2025 దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. దసరా కానుకగా ఆర్సి 16 సినిమాని రిలీజ్ చేయాలని ఉద్దేశంతోనే ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా నిర్వహిస్తున్నారట. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: