టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఆఖరుగా నటించిన ఆరు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

లైలా : విశ్వక్ సేన్ తాజాగా నటించిన ఈ సినిమాను రేపు అనగా ఫిబ్రవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 8.20 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మెకానిక్ రాఖి : విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... శ్రద్ధ శ్రీనాథ్ ఈ మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 8.50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి : విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

గామి ' విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 10.20 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

దాస్ కా దమ్కి : విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన ఈ మూవీ లో నీవేద ప్రత్రాజ్ హీరోయిన్గా నటించగా ... ఈ మూవీ లో విశ్వక్ సేన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ రెండు పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 7.5 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఓరి దేవుడా : విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 5.50 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs