టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్న వారిలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా కెరీర్ను మొదలు పెట్టిన ఈయన ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టినప్పటి నుండి ఆఖరి సినిమా వరకు ప్రతి సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇంత గొప్ప క్రేజ్ ఉన్న దర్శకుడి సినిమాలో అవకాశం వస్తే చాలా మంది ఎగిరి గంతేసి ఆనందంతో సినిమాను ఓకే చేస్తూ ఉంటారు. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా అవకాశం వస్తే ఆ ఆఫర్ను రిజెక్ట్ చేసిందట. ఆ సినిమా ఏది ..? ఆ హీరోయిన్ ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రాజమౌళి , సునీల్ హీరోగా మర్యాద రామన్న అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సలోని హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో మొదటగా సునీల్ కి జోడిగా సలోని ని కాకుండా త్రిష ను హీరోయిన్ గ తీసుకోవాలి అని రాజమౌళి అనుకున్నాడట.

అందులో భాగంగా ఆమెను వెళ్లి సంప్రదించాడట. కానీ అప్పటికి ఆమె కెరియర్ పీక్స్ లో ఉండడంతో సునీల్ పక్కన హీరోయిన్గా చేస్తే కెరియర్ డౌన్ ఫాల్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఈమె ఆ సినిమాలో హీరోయిన్ ఆఫర్ను రిజెక్ట్ చేసిందట. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో సలోని ని హీరోయిన్గా తీసుకోగా ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సలోనికి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఇప్పటికీ కూడా త్రిష అద్భుతమైన రేంజ్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: