టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశారంటూ లావణ్య చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఎంతటి సంచలనాలను సృష్టించాయో చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ఎన్నో రకాలుగా ఈ కేసు మలుపు తిరిగింది. ముఖ్యంగా ఈ కేసులో మస్తాన్ సాయి, మాల్వి మల్హోత్రా తదితర సెలబ్రిటీలు కూడా హస్తము ఉందనే విధంగా లావణ్య తెలియజేసింది. అయితే ఆ తర్వాత రాజ్ తరుణ్ పైన పెట్టిన కేసులు అన్నీ కూడా వెనక్కి తీసుకుంటానంటూ మీడియా సమావేశంలో తెలియజేసింది ఇకపై తన పోరాటం మస్తాన్ సాయి పైనే అంటూ వెల్లడించింది.



అలాగే మస్తాన్ సాయి తనపైన ఎన్నోసార్లు అత్యాచారం చేశారని తనను వంచించినట్టే చాలామంది యువతులను కూడా చెరిపారంటూ మస్తాన్ సాయి తో కలిసి పార్టీలో పాల్గొన్నట్లుగా తెలియజేసింది లావణ్య.. అలాంటి సమయంలోనే చాలామంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు తీశారని వాటిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపింది. మస్తాన్ సాయితో కలిపి ఒకానొక సమయంలో పార్టీలో పాల్గొన్నప్పుడు మత్తుమందు తనకి ఇచ్చి తనపై అత్యాచారం చేశారని తెలియజేసింది. తన హార్డ్ డిస్క్లో ఆ వీడియోలు ఉన్నట్టు తెలియజేసింది..


అందుకే హార్డ్ డిస్క్ తీసుకెళ్లి మరి కేసు పెట్టానని దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ తాను బతికి ఉంటానో లేదో తెలియదు కానీ మస్తాన్ సాయి వాళ్ళ కుటుంబాలు తనని చంపేస్తారంటూ బెదిరిస్తున్నారని  తెలియజేసింది లావణ్య.. నార్సింగ్ DI కి కాల్ చేయాలంటూ మస్తాన్ సాయి వెల్లడించారని తాను కాల్ చేసి మాట్లాడుతున్న సమయంలోనే కాల్ రికార్డు చేశారని ఇప్పుడు అదే వీడియో వైరల్ గా మారుతున్నదని.. ఇకమీదట అన్ని వివాదాలకు పుల్ స్టాప్ పెడుతున్నానని మస్తాన్ సాయి పైన న్యాయ పోరాటం చేస్తానంటూ తనని ట్రోల్  చేసిన కూడా పట్టించుకోను తాను చేస్తున్న ఈ పోరాటంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా వదిలిపెట్టను అంటూ లావణ్య పలు రకాల వ్యాఖ్యలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: