ఇటీవలే విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా  ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృధ్విరాజ్ చేసినటువంటి కామెంట్స్ వైసీపీ నేతలను హర్ట్ అయ్యేలా ఉండడంతో ఒక్కసారిగా  బాయ్ కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ సంచలనంగా మారింది. దీంతో నటుడు విశ్వక్ కూడా క్షమాపణలు చెప్పారు. కానీ ఎవరూ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు నటుడు పృధ్విరాజ్ వచ్చి క్షమాపణలు చెప్పాలని వైసీపీ సోషల్ మీడియా కూడా డిమాండ్ చేసింది. అయితే నిన్న మొన్న కొంతమేరకు ఓవర్ చేసిన కమెడియన్ పృథ్వీరాజ్ ఎట్టకేలకు గడిచిన కొన్ని నిమిషాల క్రితం క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు.


వ్యక్తిగతంగా తనకు ఎవరి మీద ద్వేషం లేదని అయినా కూడా తన వల్ల సినిమా దెబ్బ తినకూడదని మా అన్న వీర శంకర చెప్పారు అంటూ క్షమాపణలు చెప్పమన్నారు అంటూ తెలియజేశారు ఎవరివైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించండి అంటూ తెలిపారు బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అనండి అంటూ కోరడం జరిగింది. మొత్తానికి వైసీపీ దెబ్బకు కమెడియన్ పృథ్వి రాజు కూడా దిగివచ్చి మరి క్షమాపణలు చెప్పడం జరిగింది.


రేపటి రోజున లైలా సినిమా రిలీజ్ కాబోతున్నప్పటికీ ఇప్పటివరకు ఏ విధంగా కూడా ఈ సినిమా టికెట్లు బుకింగ్ కాలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా 40 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఏ మేరకు ఈ సినిమా కలెక్షన్స్ పైన వైసిపి సోషల్ మీడియా ప్రభావం పడుతుందో చూడాలి మరి. ఇప్పటివరకు ఎక్కడా కూడా ఒక టికెట్ కూడా బుకింగ్ కాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి అసలు సినిమా ఎలా ఉంటుంది ఇందులో విశ్వక్ ఎలా నటించారనే విషయం రేపటి రోజున ఉదయం పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: