
ఐతే వార్ 2 సినిమాలో rrr తరహాలోనే ఒక డ్యాన్స్ మూమెంట్ ఏర్పాటు చేస్తున్నారట. rrr లో నాటు నాటు సాంగ్ ఎంత పాపులరో తెలిసిందే. ఆ సాంగ్ కే కీరవాణికి అకాడమీ అవార్డ్ కూడా వచ్చింది. వార్ 2 లో కూడా ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఇలాంటి ఒక టఫ్ డ్యాన్స్ సాంగ్ ఫిక్స్ చేస్తున్నారట. ఈ సాంగ్ లో ఎవరు ఎలా డ్యాన్స్ చేస్తారా అని ఆడియన్స్ అంతా ఎగ్జైట్ అవుతున్నారు.
మన దగ్గర ఎన్టీఆర్ ఎలానో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ అలానే. ఆయన డ్యాన్సులు అదరగొడతాడు. ఐతే వార్ 2 సినిమాలో ఎన్ టీ ఆర్ డ్యాన్స్ ని డామినేట్ చేసేలా హృతిక్ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. ఐతే ఫ్యాన్స్ మాత్రం ఆ ఛాన్స్ అసలు లేదు ఉండదని అంటున్నారు. ఏది ఏమైనా వార్ 2 తారక్ ఫ్యాన్స్ కి మాత్రం స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. మరి అది ఎలా ఉంటుందో చూడాలి. వార్ 2 పూర్తి అవ్వడమే ఆలస్యం ఎన్ టీ ఆర్ ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా ఐతే ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ మాస్ ట్రీట్ అందిస్తారని తెలుస్తుంది.