![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/actress/145/-mrunal-thakur-new-images-collection-415x250.jpg)
ఐతే ఫౌజీ కథ ప్రకారం ప్రభాస్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మరో హీరోయిన్ నటించాల్సి ఉందట. ప్రస్తుతం హను ఆ రెండో హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలుస్తుంది. ప్రభాస్ ఫౌజీలో రెండో హీరోయిన్ గా ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే ఫౌజీ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ నటిస్తుందని లేటెస్ట్ టాక్.
ఆల్రెడీ హనుతో కలిసి సినిమా చేసిన మృణాల్ సూపర్ హిట్ అందుకుంది. హను అడగాలే కానీ ఒక చిన్న క్యామియో రోల్ అయినా చేస్తుందని చెప్పొచ్చు. సీతారామం తో తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా తన కెరీర్ ని సెట్ రైట్ చేసుకుంది మృణాల్ ఠాకూర్. సో అమ్మడికి ప్రభాస్ సినిమా ఛాన్స్ వస్తే మాత్రం అమ్మడు మరో మాట మాట్లాడకుండా ఓకే చేస్తుందని చెప్పొచ్చు. మరి ప్రభాస్ ఫౌజీలో ఆమె ఉందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాతో పాటు ప్రభాస్ స్పిరిట్ త్వరలో మొదలు కాబోతుంది. ఈ సినిమాతో పాటు కల్కి 2 ని కూడా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు. ప్రభాస్ సినిమాల లైనప్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుంది. ఫ్యాన్స్ అంతా కూడా రెబల్ బాక్సాఫీస్ రచ్చ కోసం సిద్ధంగా ఉన్నారు.