తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదటిసారిగా ఐతే సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయమైన చంద్రశేఖర్ ఏలేటి తన మొదటి సినిమాతోనే సరికొత్త కథతో ప్రేక్షకులను మంచి అనుభూతిని అందించారు. ఈ చిత్రాన్ని గుణ్ణం గంగరాజు నిర్మించారు. ఆ తర్వాత గోపీచంద్ తో కలిసి సాహసం అనే సినిమాని తెరకెక్కించి మరొక విజయాన్ని అందుకున్నారు. ఇలా తన కెరియర్ లో ఎన్నో చిత్రాలను తేరికెక్కించిన చంద్రశేఖర్ ఏలేటి ఇంట తాజాగా విషాద ఛాయలు నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈయన తండ్రి సుబ్బారావు 75 ఏళ్ల వయసులో కన్నుమూసినట్లు తెలుస్తోంది.


చంద్రశేఖర్ ఏలేటి తండ్రి మరణానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో  ఇబ్బందులు పడుతూ మరణించినట్లుగా తెలుస్తోంది... ఈయన వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో తుని మండలానికి చెందిన రేఖవాణిపాలెం లో ఉంటున్నారట. ఈయన మరణం కూడా తన నివాసంలోనే జరిగినట్లు సమాచారం. డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి తండ్రి సుబ్బారావు మరణ వార్త విని పలువురు సినీ సెలబ్రిటీలతో పాటుగా చాలా మంది అభిమానులకు కూడా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి భార్య, కీరవాణి ఈయన కుటుంబాన్ని కూడా పరామర్శించినట్లు తెలుస్తోంది.


ఇక డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి తన కెరియర్లు అన్నీ కూడా ఎన్నో ప్రయోగాత్మకమైన చిత్రాలనే తెరకెక్కించారు. ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా తదితర చిత్రాలను కూడా తెరకెక్కించారు. చార్మి, గోపీచంద్ తదితర హీరోలకు కూడా మంచి లైఫ్ ను ఇచ్చారని చెప్పవచ్చు. చివరిగా డైరెక్టర్ 2021 లో నితిన్ నటించిన చెక్ సినిమాని తెరకెక్కించారు. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాని కూడా తెరకెక్కించలేదు. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో చాలా బాధపడ్డానని తెలియజేశారు.మరి రాబోయే రోజుల్లో ఏదైనా విభిన్నమైన కథాంశంతో సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: