నటుడు రవిబాబు అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు.ఈయన కేవలం నటుడి గానే కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా కామెడీ విలన్ పాత్రలకు చాలా బాగా సెట్ అయ్యేవారు. కానీ సడన్ గా నటనకు స్వస్తి పలికి డైరెక్టర్ గా మారిపోయారు. అలా అల్లరి నరేష్ ని ఇండస్ట్రీకి అల్లరి మూవీతో పరిచయం చేసింది ఎవరో కాదు నటుడు రవిబాబే..ఇక రవిబాబు సీనియర్ దివంగత నటుడు చలపతిరావు కొడుకు అనే సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి రవిబాబు ఇప్పటికే అవును,అవును-2, అదుగో, అమరావతి, నువ్విలా వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఇక రవిబాబు తన ప్రతి సినిమాకు అ అనే అక్షరాన్ని సెంటిమెంట్ గా పెట్టుకొని తాను డైరెక్షన్ చేసే ప్రతి సినిమా టైటిల్ ముందు అ అనే అక్షరాన్ని చేరుస్తారు.

 అయితే అలాంటి రవిబాబు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరోక్షంగా ఓ హీరో పై సెటైర్లు వేశారు.నేను ఓ సినిమాలో నటించమంటే ఆ హీరో నా భుజాల దగ్గరికి ఉంటాడు. నాకంటే హైట్ తక్కువగా ఉంటాడు. నేను నటించను అని చెప్పాను. కానీ వాళ్ళు మాత్రం మీరు సినిమాలో నటించాల్సిందే అని పట్టు బట్టడంతో ఆ హీరో నాకంటే పొట్టిగా ఉంటాడు కాబట్టి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే నటిస్తాను అని చెప్పాను.. అంటూ రవిబాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే రవిబాబు మాట్లాడిన మాటలకు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్,నాజర్, రవిబాబు ముగ్గురు కలిసి కనిపించిన సీన్ చూపించారు.

దీంతో రవిబాబు పొట్టిగా ఉంటాడు హైట్ తక్కువ ఉంటాడు అని అన్నది ఏ హీరోనో కాదు జూనియర్ ఎన్టీఆర్ నే అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు. ఇక ఒక హీరోకి సంబంధించి ఏదైనా వీక్ పాయింట్ దొరికితే మరొక హీరో అభిమానులు దాన్ని ట్రోల్ చేయడం మామూలే..అలా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఈ విషయాన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్.అయితే రవిబాబు పేరు చెప్పకుండా పరోక్షంగా మాట్లాడినప్పటికీ ఎన్టీఆర్ పరువు తీశారు అని చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.మరి దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: