టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన... లైలా సినిమాకు వైసీపీ సెగ తగిలింది. ఈ సినిమా ఫిబ్రవరి 14 అంటే ఇవాళ రిలీజ్ అయింది. మొదట అమెరికాలో.. ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో.. సినిమా రివ్యూ పెట్టేస్తున్నారు చాలామంది నేటిజన్స్. కొంతమంది సినిమా బాగుందంటే... మరి కొంతమంది సినిమా బాగాలేదని చెబుతున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చిన ఈ సినిమాకు వైసీపీ సెగ మాత్రం.. తగులుతోంది.

డిజాస్టర్ లైలా సినిమా అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు వైసిపి  సోషల్ మీడియా వారియర్స్. ఇప్పటికే లక్ష... వీటిలో ఇదే సినిమా పైన వైసిపి కార్యకర్తలు పెట్టడం.. జరిగింది. డిజాస్టర్ లైలా సినిమా అంటూ... ఒక్కో అకౌంట్ నుంచి.. వందల సంఖ్యలో ట్వీట్స్ పెడుతున్నారట. దీంతో.. డిజాస్టర్ లైలా సినిమా అనే హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ప్రతి నిమిషానికి ఈ డిజాస్టర్  లైలా అనే హ్యాష్ ట్యాగ్...ట్వీట్స్ క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి.

 దీంతో లైలా సినిమా చిత్ర బృందం... తీవ్ర ఆందోళనకు గురవుతోంది. క్షమాపణలు చెప్పిన కూడా వైసిపి నేతలు దిగిరావడం లేదని ఆందోళన చెందుతోంది విశ్వక్ టీం. వసవంగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృధ్విరాజ్  రచ్చ చేసిన సంగతి తెలిసిందే.  150 మేకలు కాస్త 11 మేకలు అయ్యాయి అంటూ... లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు పృథ్వీరాజ్.

 దీంతో వైసీపీ కార్యకర్తలకు కోపం వచ్చింది. ఇంకేముంది సోషల్ మీడియాను వాడుకొని లైలా సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ దెబ్బకు తెల్లారి విశ్వక్ సారీ చెప్పాల్సి వచ్చింది. కానీ పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. అయితే పృధ్విరాజ్ క్షమాపణలు చెప్పకుండా ఆసుపత్రికి వెళ్లి మళ్లీ వైసీపీ నేతలపై రెచ్చిపోయారు. ఇక నిన్న అర్ధరాత్రి క్షమాపణలు చెప్పారు పృథ్విరాజ్. అయినప్పటికీ వైసీపీ నేతలు మాత్రం తగ్గలేదు. లైలా సినిమాను... టార్గెట్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: