హీరో విజయ్ దేవరకొండ చివరిగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు.. దీంతో తన తదుపరి చిత్రం ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కింగ్ డమ్ అనే ఒక విభిన్నమైన కథాంశంతో వస్తున్న సినిమాలో నటించారు. ఇటీవలే టీజర్ విడుదలై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేసింది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ టీజర్ చూసిన చాలామంది సెలబ్రిటీలు కూడా విజయ్ దేవరకొండ ని ప్రశంసించడం జరిగింది. ఇలాంటి సమయంలోనే ఈ టీజర్ చూసిన రష్మిక విజయ్ పైన కూడా ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది.


అతడు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త తరహాలోనే డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారని ప్రతిసారి కూడా ఒక అద్భుతంతో ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉంటారని విజయ్ నిన్ను చూసి చాలా గర్వపడుతున్నానంటూ రష్మిక ఒక ట్విట్ చేయడం జరిగింది.. దీంతో ఈ ట్వీట్ క్షణాలలో కూడా వైరల్ గా మారడంతో రష్మిక పోస్టుకు సైతం విజయ్.. ఇలా రిప్లై ఇస్తూ రష్మికని తాను ఎలా పిలుస్తారో ముద్దుగా ఈ విషయాన్ని కూడా తెలియజేశారు.. రుషి అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది విజయ్ దేవరకొండ.


కింగ్ డమ్ సినిమా టీజర్ యూట్యూబ్లో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ఈ చిత్రం మే 31వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడంతో మరింత హైలెట్గా నిలుస్తున్నది. తమిళంలో సూర్య ఈ సినిమాకి వాయిస్ అందించారట. అలాగే హిందీలో రణబీర్ కపూర్ అందించినట్లు సమాచారం. యుద్ధంతో కూడిన నేపథ్యం సినిమా అన్నట్టుగా టీజర్ చూస్తే కనిపిస్తోంది.. మరి ట్రైలర్ తో ఎలాంటి హైప్ క్రియేట్ చేసి సినిమాతో భారీ విజయాన్ని విజయ్ దేవరకొండ అందుకుంటారేమో చూడాలి. మొత్తానికైతే రష్మిక ముద్దు పేరుని విజయ్ బయట పెట్టడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: