న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన కెరీర్ లో ఎన్నో వైవిద్యమైన సినిమాలలో నటించి మెప్పించాడు.. వరుస సక్సెస్ లు అందుకుంటూ మినిమం గ్యారెంటీ హీరోగా నాని పేరు తెచ్చుకున్నాడు..నాని రీసెంట్ గా దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం “.. సినిమాలతో హాట్రిక్ హిట్స్ అందుకున్నాడు.. సినిమా సినిమాకు నాని తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు..ప్రస్తుతం నాని లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో ముఖ్యమైన సినిమా “హిట్ 3”..గతంలో వచ్చిన సూపర్ హిట్ ప్రాంచైజ్ లో ఈ సారి నాని హీరోగా నటిస్తున్నాడు.. నాని సరసన కేజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది..టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..

 గతంలో వచ్చిన హిట్ 1,హిట్ 2 సినిమాలను  డైరెక్ట్ చేసింది కూడా ఈ దర్శకుడే.. ఆ రెండు సినిమాలు ప్రేక్షకులకు సూపర్ థ్రిల్ అందించాయి.. అంతే కాదు ఈ రెండు సినిమాలకు నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు..దీనితో హిట్ సిరీస్ కి సూపర్ క్రేజ్ లభించింది.. ఇప్పుడు ఏకంగా నానినే హీరోగా నటిస్తుందటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో వున్నాయి..ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. 

ఈ సినిమాలో మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా కనిపించునున్నట్లు తెలుస్తుంది.వారెవరో కాదు హిట్ 1 ఫేమ్ విశ్వక్ సేన్, హిట్ 2 ఫేమ్ అడివి శేష్.. ఈ ఇద్దరు హీరోలు ఓ కేసు విషయంలో నానికి హెల్ప్ చేస్తారని సమాచారం..నాని, విశ్వక్, అడివి శేష్ మధ్య వచ్చే సీన్స్ సినిమాక్ హైలైట్ గా నిలుస్తాయని సమాచారం.. ఈ సినిమా కూడా హిట్ అయితే ఈ ప్రాంఛైజ్ ఇలాగే కొనసాగనున్నట్లు తెలుస్తుంది.. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ పడి చచ్చే ప్రేక్షకులు చాలా మంది వున్నారు.. అందుకే హిట్ 3 పై ఫ్యాన్స్ లో సూపర్ క్రేజ్ ఏర్పడింది..

మరింత సమాచారం తెలుసుకోండి: