ఏంటి విశ్వక్ సేన్ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతున్నారా.. సినిమాలు ఇక చేయరా.. ఎందుకు ఆయన సినిమాలో చేయనని చెబుతున్నారు.. లైలా సినిమాతోనే ఆయనది లాస్ట్ సినిమానా..ఇంతకీ ఈ సంచలన స్టేట్మెంట్ విశ్వక్ సేన్ ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.. హీరో విశ్వక్ సేన్ ఖాతాలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఈయన కాంట్రవర్సీ స్టార్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఈయన సినిమా వచ్చే ముందు ఏదో ఒక పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. ఆ కాంట్రవర్సీ విశ్వక్ సేన్ సినిమాకి పనికొస్తుంది. అలా ఇప్పటికే ఎన్నో సినిమాల విడుదలకు ముందు ఇలా కంట్రవర్సీలలో ఇరుక్కున్నారు.అయితే అలాంటి విశ్వక్ సేన్ తాజాగా ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా లైలా మూవీతో మన ముందుకు వచ్చారు.ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తోంది.

ఇక మరికొద్ది గంటలు గడిస్తే పూర్తి రివ్యూ వస్తుంది. అయితే తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న విశ్వక్ సేన్ నేను సినిమాలు చేయనంటూ ఒక సంచలన విషయం చెప్పారు. అయితే సినిమాలు చేయాలంటే మొత్తమే ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతారు కావచ్చు అని మీరు అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.ఇక విశ్వక్ సేన్ సినిమాలు చేయను అని చెప్పింది పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవుతానని కాదు. హార్రర్ సినిమాల్లో నటించనని.. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నేను హార్రర్ సినిమాల్లో నటించను అని, అలాగే హార్రర్ సినిమాలు అంటే నాకు అస్సలు భయం లేదని, కొంతమంది కావాలనే భయపడుతున్నట్టు నటిస్తారు.

 కానీ నేను ఒక్కడిని కూడా హార్రర్ సినిమా చూడడానికి అస్సలు భయపడను. ఇక హార్రర్ జోనర్ లో వచ్చే ఏ సినిమాలో కూడా నేను ఎప్పటికీ నటించను.ఫ్యూచర్లో కామెడీ మాస్ ఎంటర్టైనర్ జోనర్ లో నటిస్తాను. కానీ హారర్ సినిమాలో చేయను. నాకు హార్రర్ సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు అంటూ తన ఫ్యూచర్ ఫీల్మ్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు విశ్వక్ సేన్.ప్రస్తుతం విశ్వక్ సేన్ మాటలు విన్న చాలా మంది నెటిజన్స్ ఈ మధ్యకాలంలో హార్రర్ కామెడీ జోనర్ లో వస్తున్న చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి. కానీ అలాంటి జానర్లో విశ్వక్ సేన్ నటించనని చెప్పడానికి కారణం ఏంటో అని మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: