టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాను సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశం నిర్మిస్తున్నాడు . ఇకపోతే కొంత కాలం క్రితం సూర్య దేవర నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ , గౌతమ్ కాంబో లో రూపొందుతున్న సినిమా కథ చాలా పెద్దది. దానిని ఒక భాగంలో చెప్పలేము. అందుకే దానిని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము అని చెప్పాడు.

దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇంత కాలం పాటు VD 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ వచ్చిన ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ టైటిల్ ను విడుదల చేయడం మాత్రమే కాకుండా ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే కింగ్డమ్ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మూవీ టీజర్ కు విడుదల 24 గంటల్లో 11.88 మిలియన్ లైక్స్ , 330.7 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా యొక్క ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మధ్య కాలంలో విజయ్ వరుసగా అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఈ మూవీ తో విజయ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd