స్నేహ రెడ్డి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ భార్య . చాలా అందంగా ఉంటుంది . చాలా చక్కగా రెడీ అవుతుంది.  కొన్నిసార్లు హీరోయిన్స్ కి మించిన రేంజ్ లోనే ఘాటుఘాటుగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.  ముఖ్యంగా ఒక భార్యగా.. ఒక తల్లిగా తన బాధ్యతలను పూర్తిగా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉంటుంది.  సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుంది అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.


పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ అంత యాక్టివ్ గా ఉంటాడో లేదో తెలియదు కానీ స్నేహ రెడ్డి మాత్రం రోజుకు ఒక పోస్ట్ పెడుతూ తన పిల్లలకి సంబంధించిన విషయాలను అదే విధంగా తన ఫిట్నెస్ కి సంబంధించిన సీక్రెట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులకి అప్డేట్ ఇస్తూనే ఉంటుంది . అయితే ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ వేలో స్పందించే స్నేహ రెడ్డి ఫస్ట్ టైం సోషల్ మీడియా కారణంగా అసహనంగా ఒక పోస్ట్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  రీసెంట్గా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఒక పోస్ట్ పెట్టింది.



"ప్రతి షాప్ లాగే సోషల్ మీడియా కూడా 6:00కి క్లోజ్ చేస్తే ఎంత బాగుంటుంది . అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో .. వాళ్ళ స్నేహితులతో చక్కగా కలిసి మాట్లాడుకుంటారు . సంగీతాన్ని ఎంజాయ్ చేస్తారు. వాళ్లకున్న ప్రతిభను బయటపెడతారు . ప్రశాంతంగా ఉంటారు " అనే రేంజ్ లో సోషల్ మీడియా వల్ల ప్రశాంతత మిస్సైంది అంటూ పరోక్షకంగా పోస్ట్ పెట్టింది. దీనిపై చాలామంది జనాలు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. స్నేహ రెడ్డి పెట్టిన పోస్ట్ 100% నిజం అని సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో టూ మచ్ గా హద్దులు మీరు పోతుంది అని కామెంట్స్ పెడుతున్నారు.



మరికొందరు మాత్రం స్నేహారెడ్డికి ప్రాబ్లం వస్తేనే సోషల్ మీడియాపై ఇలా రియాక్ట్ అవుతుందని గతంలో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ సోషల్ మీడియా కారణంగా ఇబ్బందులకు గురయ్యారని.  అప్పుడు ఇలాంటి పోస్ట్ పెట్టి ఉంటే నిజంగా స్నేహ రెడ్డి పై మంచి ఒపీనియన్ ఉండేది అని .. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్  పై ట్రోలింగ్ జరుగుతుంది అన్న కారణంగానే ఇలా తన భర్తను కవర్ చేసుకునే మూమెంట్లో స్నేహ రెడ్డి పోస్ట్ పెట్టింది అంటూ చాలామంది ఆమెను కూడా ట్రోల్ చేస్తున్నారు.  సోషల్ మీడియాలో ప్రజెంట్ స్నేహ రెడ్డి పేరు బాగా బాగా వైరల్ గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: