మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే. మాస్ అయినా, ఫ్యామిలీ ఎమోషన్స్ అయినా, పీరియాడిక్ మూవీ అయినా, మైథాలజీ స్టోరీ అయినా.. ఇలా ఏ జానర్ అయినా సరే రామ్ చరణ్ విశ్వరూపం చూపించగల హీరో. రీసెంట్‌గా 'గేమ్ ఛేంజర్' మూవీ ఆశించినంతగా ఆడకపోయినా.. రామ్ చరణ్ నటనకు మాత్రం విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆయన టాలెంట్ ని ఇంకా సరిగ్గా వాడుకోలేదని చాలామంది ఫీలయ్యారు.

ప్రస్తుతం రామ్ చరణ్.. డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మాత్రం రామ్ చరణ్ తనలోని నట విశ్వరూపాన్ని మరోసారి చూపిస్తారని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇది అయిపోగానే డైరెక్టర్ సుకుమార్‌తో సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కొత్త డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు.

కిల్ మూవీ డైరెక్టర్ నిఖిల్ నాగేశ్ భట్.. రామ్ చరణ్‌తో ఒక అదిరిపోయే ప్రాజెక్టు కోసం అప్రోచ్ అయ్యారట. రీసెంట్‌గా నిఖిల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ మూవీ మైథాలజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్పారు. అంతేకాదు.. ఇది సత్య యుగం బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందట. మన హిందూ పురాణాల్లో యుగాల గురించి ఉంటుంది కదా.. సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం అని.

ఇప్పటికే త్రేతా యుగం (రాముడి కథ), ద్వాపర యుగం (కృష్ణుడి కథ), కలియుగం (విష్ణువు చివరి అవతారం కల్కి) మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ సత్య యుగం గురించి మాత్రం ఎవ్వరూ టచ్ చేయలేదు. ఆ లోటుని నిఖిల్ భర్తీ చేయబోతున్నాడు. సత్య యుగంలో లైఫ్ ఎలా ఉండేది, అప్పటి విలువలు, న్యాయం, ధర్మం.. ఇవన్నీ ఈ సినిమాలో చూపిస్తారట. అంతేకాదు.. ఆ యుగంలో అన్యాయాన్ని ఆపడానికి విష్ణువు ఏ రూపంలో అవతరించాడో కూడా చూపిస్తారట.

ఇటీవలే నిఖిల్ ఈ స్టోరీని రామ్ చరణ్‌కి చెప్పాడట. స్టోరీ విన్న రామ్ చరణ్ ఇంప్రెస్ అయిపోయి వెంటనే ఓకే చెప్పేశాడని టాక్. సుకుమార్ స్క్రిప్ట్ ఇంకా రెడీ అవ్వకపోవడంతో.. రామ్ చరణ్ ముందుగా నిఖిల్ సినిమాని కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడట. నిఖిల్ ఈ ప్రాజెక్టుని పక్కాగా ప్లాన్ చేశాడట. షూటింగ్ జస్ట్ సిక్స్ మంత్స్‌లో ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. బహుశా 2000 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: