అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'తండేల్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో దుమ్ము దులిపిందో అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. దీంతో అక్కినేని క్యాంప్ మొత్తం ఫుల్ ఖుషీలో ఉంది. సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులు సైతం 'తండేల్' సినిమా చూసి ఫిదా అయిపోయారు..

రీసెంట్ గా టాలెంటెడ్ హీరో ధనుష్, డాన్స్ మాస్టర్ ప్రభుదేవాసినిమా చూశారట. సినిమా చూసిన వెంటనే వాళ్లు స్వయంగా ఫోన్ చేసి మరీ 'తండేల్' టీమ్ కి కంగ్రాట్స్ చెప్పారంటే, సినిమా ఏ స్థాయిలో వాళ్ళని మెస్మరైజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ప్రభుదేవా అయితే స్పెషల్ ఫ్యాన్ అయిపోయారట.

ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే, ధనుష్ కి 'తండేల్' సినిమా బాగా నచ్చేయడంతో, ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. నిజానికి 'తండేల్' సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా రిలీజ్ అయింది. కానీ, నాగ చైతన్యకి వేరే రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేకపోవడంతో, అక్కడ ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. అందుకే ధనుష్ ఈ సినిమాని తమిళ ప్రేక్షకులకు తగ్గట్టుగా రీమేక్ చేస్తే, అదిరిపోయే హిట్ కొట్టొచ్చని భావిస్తున్నారట.

మధ్యలో ఓటీటీల హవా పెరిగిపోవడంతో రీమేక్ సినిమాలపై జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ, ఇప్పుడు మళ్లీ రీమేక్ ట్రెండ్ ఊపందుకుంటున్నట్టు కనిపిస్తోంది. సూపర్ స్టార్ విజయ్ కూడా తన లాస్ట్ మూవీగా 'భగవంత్ కేసరి' రీమేక్ చేస్తున్నాడు. అంటే, రీమేక్ సినిమాని సరిగ్గా తీస్తే ఇప్పటికీ ఆడియన్స్ ఆదరిస్తారని చెప్పొచ్చు.

ధనుష్ విషయానికొస్తే, తమిళంలో ఆయనొక మిడ్ రేంజ్ హీరో. ఆయన రీమేక్ చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేదే ఇప్పుడు హాట్ టాపిక్. సాయి పల్లవి రీమేక్ సినిమాల్లో నటించడానికి పెద్దగా ఇష్టపడదు. ఇదివరకు చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలో చెల్లెలి పాత్ర కోసం ఆమెను అడిగితే, రీమేక్ అని చెప్పి రిజెక్ట్ చేసిందట. సో, సాయి పల్లవి ఛాన్స్ అయితే లేదు. దీంతో కృతి శెట్టికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కృతి శెట్టి కూడా ఒక మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమాలో కనుక ఆమె బాగా నటించి మెప్పిస్తే, తన కెరీర్ కి తిరుగుండదు.

మొత్తానికి 'తండేల్' రీమేక్ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ రీమేక్ ఎలా ఉంటుందో, ఒరిజినల్ సినిమా రేంజ్ లో హిట్ అవుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: