![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/samantha-valentine-s-day-comment-virald96438c6-6088-456d-ac5f-278cb1981609-415x250.jpg)
సమంత కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి. తనకు పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధంగా ఉన్నది. ఇటీవలే వెబ్ సిరీస్లలో కూడా సత్తా చాటుతున్న సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు పలు సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పుడైనా సరే మన ఆరోగ్య విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని హెల్త్ ను నిర్లక్ష్యం ఎవరూ చేయవద్దంటూ తెలిపింది.. ఒక పర్సన్ తో మనం మంచి రిలేషన్ లో ఉండవచ్చు కానీ మనం మెంటల్ గా, ఫిజికల్ గా లేనప్పుడు.. మీ భాగస్వామికి నచ్చినట్లుగా మీరు కనిపించలేరని తెలిపింది సమంత.
ఒక పర్సన్ మీకు అందంగా కనిపించినప్పుడు మానసికంగా, ప్రశాంతంగా ఉంటారని తెలియజేసింది. ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తించలేక పోతే మీరు ఆ సమయంలో మీ భాగస్వామిని కూడా కోల్పోవలసి వస్తుంది అంటూ సమంత వెల్లడించింది. ప్రస్తుతం వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. మరి సమంత ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందో అనే విషయం మాత్రం తెలియాల్సి ఉన్నది. తెలుగులో కూడా సినిమాలలో నటించమని అభిమానులు కోరుకున్నప్పటికీ సమంత తదుపరి చిత్రాన్ని మాత్రం ఇంకా తెలుపలేదు.