నాగ చైతన్య సమంత విడాకుల విషయం ఎప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపికే. అయితే చాలామంది ఇద్దరికీ వేరే ఎఫైర్ ఉండడంతో విడిపోయారు అనుకుంటే..మరి కొంతమందేమో సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు ఉన్న వ్యాధి బయటపడింది కాబట్టి అనారోగ్యం కారణంగానే విడాకులు తీసుకుంది అని మరి కొంతమంది అంటారు.ఇక వీరి విడాకులకు కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ అసలు కారణం మాత్రం బయటపడలేదు.అయితే రీసెంట్ గా తండేల్ సినిమా ప్రమోషన్స్ లో నాగచైతన్య తన విడాకులకు కారణం ఏంటో బయట పెట్టలేదు కానీ ఇద్దరం ఒక డెసిషన్ కి వచ్చే వెయ్యి సార్లు ఆలోచించి విడాకుల నిర్ణయం తీసుకున్నాం దీన్ని ఎంటర్టైనింగ్ గా తీసుకొని మీరు గుచ్చి గుచ్చి మళ్ళీ ఇదే ప్రస్తావించకండి అంటూ అందరి నోర్లు మూతపడేలా చేశారు. 

అయితే నాగచైతన్య విడాకులపై స్పందించిన కొద్దిరోజులకే సమంత కూడా తన విడాకులపై పరోక్ష కామెంట్లు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.అయితే రీసెంట్గా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన రిలేషన్షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మీరు ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్న సమయంలో ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యాన్ని అస్సలు నెగ్లెట్ చేయకూడదు. శారీరకంగా మానసికంగా బాగా లేకపోతే మీరు మీ పార్ట్ నర్ కి నచ్చినట్లు ఉండరు. అందుకే మీరు ఓ వ్యక్తితో మంచి అనుబంధంతో మెదలాలంటే కచ్చితంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.

కొంతమంది బయటికి బాగా కనిపించినప్పటికీ మానసికంగా లోపల మాత్రం ప్రశాంతంగా ఉండరు. ఈ కారణంగా మనం ఇష్టపడిన భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుంది అంటూ విడాకులపై  పరోక్ష వ్యాఖ్యలు చేసింది సమంత.అయితే సమంత ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే ఆమె నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది అని, అందుకే చైతన్యనీ వదులుకున్నట్టు పరోక్షంగా తేల్చేసింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: