టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ తాజాగా చేసిన సినిమా లైలా. ఈ సినిమా... షూటింగ్ అలాగే ట్రైలర్ లాంచ్ వరకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. కానీ లైలా సినిమా ఫ్రీ రిలీజ్... ఈవెంట్ సందర్భంగా... కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన కామెంట్ రచ్చ రచ్చ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీకి మండిపోయేలా చేశాయి పృథ్వీరాజ్ కామెంట్స్. 150 మేకలు అలాగే 11 మేకలు అంటూ వంకరగా మాట్లాడిన పృథ్వీరాజ్... వైసీపీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

 అయితే దీనికి కౌంటర్ వైసీపీ గట్టిగానే ఇచ్చింది. మొన్నటి వరకు బైకాట్ లైలా సినిమా అంటూ ప్రచారం చేసిన వైసిపి సోషల్ మీడియా.. ఇవాళ డిజాస్టర్ లైలా సినిమా అంటూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. పృధ్వి రాజు చేసిన కామెంట్లకు విశ్వక్ సారీ చెప్పినప్పటికీ... వైసిపి నేతలు తగ్గడం లేదు. నిన్న రాత్రి... పృధ్విరాజ్ ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పిన కూడా వైసిపి కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి పోవడం లేదు.

 అయితే వైసిపి అంటే పడని కొంతమంది స్టార్లు అలాగే హీరోలు... లైలా సినిమా భారీ హిట్ అందుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా లైలా సినిమా హీరో విశ్వక్  కు సోషల్ మీడియా వేదికగా ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. ఈ తరుణంలోనే మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా హీరో విశ్వక్ కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. సినిమా బంపర్ హిట్ అవుతుందని... ఎలాంటి భయం లేదంటూ వ్యాఖ్యానించాడు.

 అయితే ఇది గమనించిన వైసీపీ సోషల్ మీడియా... మెగా హీరో సాయిధరమ్ తేజ్ ను ఒక ఆట ఆడుకుంటుంది. గేమ్ చేంజర్ సినిమా సమయంలో కూడా... సాయి ధరమ్ తేజ్ ఇలాగే పోస్ట్ పెట్టాడని... ఆ దెబ్బకు సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు విశ్వక్ సినిమాకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాడని.. దీంతో లైలా సినిమా కూడా దొబ్బుద్దని కామెంట్స్ చేస్తున్నారు వైసిపి నేతలు. దీంతో సాయి ధరంతేజ్ ను ట్రోలింగ్ చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: