టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం 100 నుంచి 150 సినిమాలు తెరకెక్కి రిలీజ్ అవుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేమ కథలతో తెరకెక్కిన సినిమాలు కావడం గమనార్హం. ఈరోజు వాలెంటైన్స్ డే కాగా తెలుగు సినిమాలలో ఫేమస్ లవ్ డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
 
పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతం అయితే, ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతం - జాను
 
ప్రేమను ప్రేమించిన ప్రేమ.. ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది - గమ్యం
 
ప్రేమంటే పట్టుకోవడం నాన్నా.. వదిలేయడం కాదు - ఉప్పెన
 
జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పటికీ మనతోనే ఉంటాయి మోయక తప్పదు - తొలిప్రేమ
 
సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు - నువ్వే నువ్వే
 
ప్రేమకు చావు లేదంటారు కదా.. అలాంటప్పుడు చచ్చేంత ప్రేమ ఎలా పుడుతుంది - ఒక మనసు
 
ప్రేమనేది పద్మవ్యూహంలాంటిది.. మాకందులోకి ఎలా వెళ్లాలో తెలుసు తప్ప ఎలా బయటపడాలో తెలియదు - చిత్రలహరి
 
బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమ కాదు.. నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
 
లవ్ ఫెయిల్ అయిన తర్వాత లైఫ్ లేదనుకుంటే.. 25 ఏళ్ల తర్వాత ఎవరూ బ్రతకరు - రాజా రాణి
 
గులాబీని ఇష్టపడితే కోస్తాం.. అదే గులాబీని ప్రేమిస్తే నీళ్లు పోస్తాం - కంచె

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో లవ్ స్టోరీలు తెరకెక్కగా ఆ లవ్ స్టోరీలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం. టైర్1 స్టార్ హీరోలలో చాలామంది హీరోలు ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.





మరింత సమాచారం తెలుసుకోండి: