సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమా రికార్డు ను మరో సినిమా బ్రేక్ చేయడం , ఒక హీరో రికార్డును మరో హీరో సినిమా బ్రేక్ చేయడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కొన్ని సందర్భాలలో ఓ సినిమాలో హీరో , హీరోయిన్ నటించిన సినిమాలు తమ సినిమాల రికార్డులను క్రాస్ చేయడం కూడా జరిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే తాజాగా నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా తండెల్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటి వరకు ఆరు రోజులు బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టు విషయంలో నాగ చైతన్య , సాయి పల్లవి తమ సినిమాల రికార్డులను తమే దాటి వేశారు. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా తండెల్ విడుదల ఆయన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.73 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే గతంలో ఆ స్థానంలో నాగ చైతన్య హీరోగా రూపొందిన మజిలీ సినిమా 1.66 కోట్ల కలెక్షన్లతో కొనసాగింది. ఆ స్థానాన్ని నాగ చైతన్య తన సినిమాతోనే క్రాస్ చేశాడు.

ఇకపోతే మజిలీ సినిమా తర్వాత స్థానంలో సాయి పల్లవి హీరోయిన్గా రూపొందిన ఫీదా సినిమా 1.57 కోట్ల కలెక్షన్లతో కొనసాగింది. తండెల్ సినిమా 1.73 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మజిలీ సినిమా కంటే ముందు వరుసలోకి రావడంతో ఫిదా సినిమా మరికాస్త కింది వరస లోకి చేరిపోయింది. ఇలా చైతూ , సాయి పల్లవి ఇద్దరు తమ సినిమాలతో తమ సినిమాల రికార్డులను క్రాస్ చేసేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: