నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి విజయాలను అందుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం పాటు వరుస అపజయాలను ఎదుర్కొన్న బాలయ్య "అఖండ" మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి , తాజాగా డాకు మహారాజు సినిమాలతో విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ తర్వాత బాలయ్య తనకు వీర సింహా రెడ్డి మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే తాజాగా బాలయ్య తో సినిమా చేయడానికి ఓ దర్శకుడు అత్యంత ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అతను ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు హరీష్ శంకర్. ఈయన చాలా కాలం క్రితం దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడు ప్రస్తుతం బాలకృష్ణ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు , అందులో భాగంగా ఆయన కోసం ఓ కథను కూడా తయారు చేస్తున్నట్లు , కథ కనుక బాగా వచ్చినట్లయితే బాలయ్యకు చెప్పడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ కాంబోలో మూవీ కనుక సెట్ అయినట్లయితే ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది అని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: