తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే మంచి గుర్తింపును సంపాదించుకు న్న యువ నటి మణులతో శ్రద్ధ శ్రీనాథ్ ఒకరు. ఈ బ్యూటీ నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడం , అలాగే ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది.

ఆ తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. పోయిన సంవత్సరం ఈమె విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మెకానిక్ రాఖీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ మూవీ లో ఈమె నటనకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. అలాగే ఈ మూవీ లో ఈమె తన అందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ బ్యూటీ నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ప్రస్తుతం ఈమె అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

సినిమాల్లో వీలు చిక్కి నప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: