కొంత కాలం క్రితం తమిళ స్టార్ హీరో లలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ "జైలర్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... రమ్యకృష్ణమూవీ లో రజనీ కాంత్ కు భార్య పాత్రలో నటించింది. సునీల్ , తమన్నామూవీ లో ముఖ్య పాత్రాలలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా జైలర్ 2 ను రూపొందించబోతున్నట్లు అనేక వార్తలు అనేక రోజులుగా వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంతకాలం క్రితమే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే జైలర్ 2 లో నందమూరి నట సింహం బాలకృష్ణ ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఆ విషయంపై బాలకృష్ణతో సంప్రదింపులు జరపగా బాలకృష్ణ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ 2 బాలకృష్ణ పాత్ర దాదాపు పది నిమిషాల వరకు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా జైలర్ 2 సినిమాలో బాలకృష్ణ పది నిమిషాల పాటు కనిపించనున్నాడు అనే వార్తలు వైరల్ కావడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక బాలయ్య ఈ సినిమాలో నిజంగానే నటించినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: