ప్రదీప్ రంగనాథన్ గురించి పరిచయం అనవసరం. ఈయన దర్శకుడు మరియు నటుడు. ప్రదీప్ ఎక్కువగా తమిళ సినిమాలు తెరకెక్కిస్తాడు. ఇటీవల ఈయన తెరకెక్కించిన లవ్ టుడే సినిమా మంచి హిట్ కొట్టింది. అయితే ఎప్పుడు దర్శకత్వం వహించిన ప్రదీప్ ఈ సినిమాలో మాత్రం హీరోగా నటించాడు. ఇప్పటికే ప్రదీప్ కి దర్శకుడిగా మంచి పేరు ఉండగా.. ఇప్పుడు హీరోగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత నుండి ప్రదీప్ రంగనాథన్ వరుసగా సినిమాలలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇక మరికొన్ని రోజుల వరకు ప్రదీప్ దర్శకత్వంలోకి వచ్చేల కనిపించట్లేదు.
ప్రస్తుతం డ్రాగన్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ భాషలో నిర్మించారు. అయితే ఈ సినిమా కామెడీ డ్రామా అంట. డ్రాగన్ మూవీలో ప్రదీప్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. 
అయితే డ్రాగన్ సినిమా ఈవెంట్ లో ప్రదీప్ ఎమోషనల్ అయ్యారు. ఆ ఈవెంట్ లో ప్రదీప్ మాట్లాడుతూ.. 'నేను లవ్ టుడే సినిమాలో హీరోగా నటించాను. ఈ సినిమా మంచి హిట్ కొట్టి, కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఆ సినిమా కోసం నేను చాలా మంది హీరోయిన్ లా దగ్గరికి వెళ్ళాను. కానీ ఒక్కరూ కూడా ఒప్పుకోలేదు. తాను హీరో అని చెప్పగానే.. చాలా మంది మొహం మీదనే రిజెక్ట్ చేశారు. కొందరు ఇన్ డైరెక్ట్ గా వద్దు అన్నారు. మరికొందరు సూటిగా స్టార్ హీరోలతోనే నాటిస్తామని చెప్పారు. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు నాకు అనుపమ పరమేశ్వరన్, కాయదు లాంటి హీరోయిన్స్ దొరికారు. నేను హీరోగా నటిస్తున్న డ్రాగన్ సినిమాలో వాళ్లు నటించారు' అంటూ దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్ చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: