![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/chay-and-sobhita-join-hands-onscreen-tooef197e2d-f5b4-4b86-99cf-d5730a154377-415x250.jpg)
కీర్తి సురేష్ ఆంటోని తట్టిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జోడీ చూడముచ్చటగా ఉందని సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్లు వ్యక్తమయ్యాయి. గతేడాది డిసెంబర్ నెల 12వ తేదీన కీర్తి సురేష్ ఆంటోనీల వివాహం జరిగింది. నాగచైతన్య శోభిత గతేడాది పెళ్లిపీటలెక్కారు. డిసెంబర్ నెల 4వ తేదీన చైతన్య శోభితల వివాహం ఒకింత గ్రాండ్ గా జరగడం గమనార్హం.
2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 16వ తేదీన అదితీరావు హైదరీ సిద్దార్థ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2024 సంవత్సరం ఆగష్టు 22వ తేదీన కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం గమనార్హం. సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్ గతేడాది జూన్ నెల 23వ తేదీన పెళ్లి చేసుకున్నారు. రకుల్ జాతీ భగ్నానీ సైతం గతేడాది ప్రేమించి పెళ్లి పీటలెక్కారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ నికోలయ్ సచ్ దేవ్ వివాహం గతేడాది జరిగిందనే సంగతి తెలిసిందే. 2023 నవంబర్ లో వరుణ్ తేజ్ లావణ్య్ త్రిపాఠి పెళ్లి జరిగింది. అమలాపాల్ జగత్ దేశాయ్ వివాహం 2023 సంవత్సరం అక్టోబర్ లో జరిగింది. కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా 2023లో పెళ్లి పీటలెక్కారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో మరి కొందరు సెలబ్రిటీలు లవ్ మ్యారేజ్ కు సంబంధించి శుభవార్త చెప్పే ఛాన్స్ ఉంది. ఒక మిడిల్ రేంజ్ స్టార్ హీరో క్రేజీ బ్యూటీతో లవ్ లో పడ్డారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.