![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/cinemad1d8aa12-eb78-46bf-9271-7b6b81af69dc-415x250.jpg)
అయితే విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా వైసీపీకి సారీ చెప్పిన వారు తగ్గలేదు. ఇప్పటికీ బాయ్ కాట్ మూవీ అంటూ హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు. ఇక ఇటీవల మరోసారి విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ వీడియో పెట్టాడు. ఆ వీడియోలో విశ్వక్ మాట్లాడుతూ.. 'అందరికీ నమస్తే. రేపు మా సినిమా రిలీజ్ అవుతుంది. మధ్యలో చాలా అపార్థాలు వచ్చాయి. మా తప్పు లేకపోయినా నేను, మా టీమ్ మొత్తం క్షమాపణలు చెప్పాము. అందరం కోపం తగ్గించుకుని.. అపార్ధలు తగ్గించుకోవాలి. నేను కూడా మీలో ఒకడినే. నాకు మీ సప్పోర్ట్ కావాలి. మంచి సినిమా తీశాము. వచ్చి చూసి కడుపుబ్బా నవ్వి వెళ్లండి. అందరం కలిసి సినిమాను గెలిపిద్దాము, మీ అందరి ఆశీస్సులు కావాలి' అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో మోడల్ సోనూగా, అమ్మాయి లైలాగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్స్‌లో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ఈ సినిమా రామ్ నారాయణ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీగా తొలి పరిచయం ఆకాంక్షా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విశ్వక్ సేన్ నటించిన అన్నీ మూవీస్ లో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండేది. మాస్ కా దాస్ పాత్రలలో తెరపై కనిపించే విశ్వక్.. ఇప్పుడు ఈ సినిమాలో లేడి కేటాప్ లో అదరగొట్టనున్నారు.