హిందీ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటీమణులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో జాన్వి కపూర్ ఒకరు. హిందీ సినిమాల ద్వారా కెరీర్ ను మొదలు పెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస పెట్టి తెలుగు సినిమాలలో నటిస్తోంది. కొంత కాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.

ఇకపోతే మరికొంత కాలం లోనే దేవర పార్ట్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇందులో కూడా ఈమె నటించబోతోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా ప్రస్తుతం వరుస పెట్టి తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఓ తమిళ దర్శకుడి సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో పా రంజిత్ ఒకరు.

ఇకపోతే ఈయన మరి కొంత కాలం లోనే ఓ తమిళ వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి పా రంజిత్ నిర్మించబోయే వెబ్ సిరీస్ లో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇక పా రంజిత్ నిర్మించబోయే వెబ్ సిరీస్ కావడంతో ఈ వెబ్ సిరీస్ పై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: